

హైదరాబాద్‌లో జరిగిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్పత్రి ఆవిర్భావం వెనుక ఉన్న కథను గుర్తు చేశారు. బసవతారకానికి క్యాన్సర్ సోకిన సమయంలో తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో, అలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే సంకల్పంతో ఎన్టీఆర్ విజన్ మేరకు ఈ ఆస్పత్రిని స్థాపించామని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
100 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి నేడు 650 పడకల అత్యాధునిక వైద్య సంస్థగా ఎదిగిందని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న నందమూరి బాలకృష్ణ సేవలను ప్రశంసిస్తూ, ఎంత బిజీగా ఉన్నా రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఏడాది మూడు లక్షలకుపైగా రోగులకు సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రి దేశంలోనే అతిపెద్ద లాభాపేక్షలేని వైద్య సంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!