

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి జులై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తారు. హైదరాబాద్ జిల్లాలో ఇంగ్లిష్‌లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 3.38 కోట్లకు పైగా ఓటర్లందరికీ ఈ పత్రాలను అందించి, నింపిన వివరాలను సేకరించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
బీఎల్‌వోలు ప్రతి ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించి పత్రాల పూరణపై అవగాహన కల్పించనున్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బీఎల్‌వోలు, పర్యవేక్షకులు, ఎన్నికల అధికారులు ఈ సర్వేలో పాల్గొని ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా పూర్తి చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!