
ఓటీటీ

దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించడంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. రాజధాని కారకాస్‌లో భవనాలు బలంగా ఊగిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజల దృశ్యాలు, భవనాలు కంపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం తొలి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో, అనంతరం 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. తొలి భూకంప కేంద్రం వెనెజువెలా కరేబియన్ తీరంలోని మోరోన్‌కు పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం వివరాలు అధికారికంగా వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!