
సినిమాలు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. 260 మంది ప్రయాణికులతో శంషాబాద్ నుంచి సింగపూర్‌కు బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గమనించిన పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు.
పరిస్థితిని అంచనా వేసిన అధికారులు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో విమానం సురక్షితంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా దింపి తదుపరి ఏర్పాట్లు చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!