
న్యూస్

ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోంస్లే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఈ యువతి, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన కేరళకు చెందిన యువకుడు ఫర్మాన్ ఖాన్ తో గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉంది.
అయితే ఈ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో ప్రియుడిని కలవడానికి మోనాలిసా కేరళలోని తిరువనంతపురం కు వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి తమకు రక్షణ కల్పించాలని కేరళ పోలీసుల ను ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా, కుంభమేళాలో వైరల్ అయిన తర్వాత మోనాలిసాకు తెలుగు మరియు హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ఆమె జీవితం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!