
గాసిప్స్

ఢిల్లీ లో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో మహాభారతంలోని శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఆధారంగా రూపొందించిన ఏఐ డిజిటల్ అవతారాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ లో ఏర్పాటు చేసిన ఈ హైటెక్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
హోలోగ్రామ్ సాంకేతికతతో రూపొందించిన ఈ కృష్ణార్జునుల అవతారాలు, సందర్శకులు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానాలు ఇస్తున్నాయి. ధర్మం, జీవితం, అంతర్ముఖ శత్రువులు వంటి విషయాలపై ఏఐ ఆధారంగా స్పందనలు అందిస్తున్నాయి.
అదే సమయంలో, పూర్తిగా ఏఐతో రూపొందించిన "మహాభారతం: ఏక్ ధర్మయుద్ధ" సిరీస్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలను కూడా ప్రదర్శించారు. పాత ఇతిహాసాలను ఆధునిక తరానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!