
ఆరోగ్యం

కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు కాంగ్రెస్ హైకమాండ్‌తో వీరిద్దరూ సమావేశం కానుండగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యూహాలపై కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అదేవిధంగా కర్నాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పులు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం, అంతర్గత సమన్వయంపై హైకమాండ్ సూచనలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!