
గాసిప్స్

హిందీ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా పరమపదించారు. ఆయన మరణం సాహిత్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హిందీ సాహిత్యానికి ఆయన అందించిన విశేష సేవలు ఎప్పటికీ మరపురానివని పలువురు సాహితీవేత్తలు గుర్తుచేస్తున్నారు.
వినోద్ కుమార్ శుక్లా మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాపం ప్రకటించారు. “జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత రచయిత వినోద్ కుమార్ శుక్లా మరణం ఎంతో బాధాకరం. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన అమూల్యమైన కృషి ఆయనను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు. ఆయన మరణంతో హిందీ సాహిత్యానికి తీరని లోటు ఏర్పడిందని సాహిత్యాభిమానులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!