

జార్ఖండ్ రాష్ట్రం లతహార్ జిల్లా మహువాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బస్సు (15AB0564) బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 85 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మహువాడ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణికులు ఛత్తీస్‌ఘడ్‌లోని బలరంపూర్ నుంచి లోధ్ ఫాల్‌కి స్కూల్ బస్సులో వెళ్తున్నారు, వీరు అంతా వివాహ కార్యక్రమానికి చేరడానికి ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించగా, సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు మహిళల మృతదేహాలను బస్సు కింద నుండి వెలికితీశారు. ఇంకా మరిన్ని మృతదేహాలు బస్సు కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ కుమార్ గౌరవ్ తెలిపారు. మృతులను రేసంతి దేవి (35), ప్రేమ దేవి (37), సీతా దేవి (45), సుఖ్నా భూయాన్, సోనమతి దేవి (55)గా గుర్తించారు. గాయపడిన 85 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక కారణాల ప్రకారం, డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సును నియంత్రించలేక ఈ ప్రమాదం జరిగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!