
న్యూస్

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ ప్రతీకార దాడులు చేసినట్లు సమాచారం. వందల కొద్దీ క్షిపణులను ప్రయోగించినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. టెల్ అవీవ్ నగరంలో పలు భారీ భవనాలు కుప్పకూలినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయుధ నిల్వల స్థావరంతో పాటు నగరంలోని సముద్ర తీర నౌకాశ్రయ ప్రాంతం కూడా దాడులకు గురైనట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఇరాక్ ప్రాంతంలో ఉన్న అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. లెబనాన్ ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి శాంతి దళాల కార్యాలయంపై కూడా క్షిపణి దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!