

పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్–1975 ప్రకారం అమలులో ఉన్న జోనల్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ప్రత్యక్ష నియామకాలలో స్థానికతకు సంబంధించిన కేడర్, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థల పై స్పష్టత ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాలను మొత్తం ఆరు జోన్లుగా విభజించింది. ఈ ఆరు జోన్లను రెండు మల్టీ జోన్ల కింద సమూహాలుగా ఏర్పాటు చేసింది. అలాగే, అభ్యర్థి ఏ ప్రాంతాన్ని స్థానికంగా పరిగణించాలన్న విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే ప్రాంతంలో నిరంతరంగా ఏడు సంవత్సరాలు చదువుకున్న ప్రదేశాన్ని స్థానిక ప్రాంతంగా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది.
జోన్ – 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
జోన్ – 2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
జోన్ – 3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
జోన్ – 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్ – 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్ – 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి
ఈ మార్పులతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు మరింత స్పష్టత, పారదర్శకత ఏర్పడనుందని అధికారులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!