
ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. గత రెండు రోజులుగా రవిని విచారిస్తుండగా, ఈ విచారణలో పలు కీలక అంశాలు బయటపడినట్లు సమాచారం. రెండో రోజు కస్టడీలో రవిని 6 గంటలకుపైగా ప్రశ్నించిన పోలీసులు, ఈరోజు (శనివారం) కూడా మూడో రోజు విచారణకు సిద్ధమయ్యారు.
రవికి సినిమాలు సప్లై చేసిన వారు ఎవరు? ఆయనకు సహకరించిన నెట్వర్క్ ఏంటి? ఏజెంట్లు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
విచారణలో వెల్లడి అయిన అంశాల ప్రకారం, రవి తమిళ, హిందీ వెబ్సైట్ల నుంచి సినిమాలను కొనుగోలు చేస్తున్నాడు. ముఖ్యంగా మూవీ రూల్జ్ వెబ్సైట్ నుంచి పెద్ద మొత్తంలో సినిమాలు తీసుకున్నట్లు చెప్పిన రవి, ఇందుకు క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేశానని ఒప్పుకున్నాడు.
ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కి గేట్‌వేలా వాడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వ్యూయర్ బేస్ పెంచుకోవడానికి ఆయన క్వాలిటీ కంటెంట్‌ను క్రమం తప్పకుండా పోస్ట్ చేసేవాడని విచారణలో తెలుస్తోంది.
ఇంకా, ఈ మొత్తం ఆపరేషన్ కోసం రవి కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేసినట్లు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. ఈ పనికి సపోర్టుగా దాదాపు 20 మంది యువకులను నియమించుకున్నట్లు కూడా తెలిసింది.
దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఇంకా ఎన్నో కీలక నెట్వర్కులను వెలికితీయవచ్చని అధికారులు భావిస్తున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!