

అమీన్పూర్ మండలంలో ఉన్న రెండు పార్కు స్థలాలను హైడ్రా అధికారులు గురువారం రక్షించారు. సర్వే నంబర్లు 152, 153 లో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో 144 ప్లాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరుతో లేఅవుట్ రూపొందించారు. ఈ లేఅవుట్ను మునోత్ ప్రైవేట్ ట్రస్ట్ తరఫున మేనేజింగ్ ట్రస్టీ ఫవర్లాల్ రూపొందించినట్లు సమాచారం. తరువాత 2012లో బాధ్యతలు చేపట్టిన మహాకుమార్ జైన్, ఇందులోని 7 ఎకరాలను వ్యవసాయ భూమిగా చూపిస్తూ విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. మిగిలిన 8 ఎకరాల లేఅవుట్లో ఉన్న రెండు పార్కులను ఆక్రమించే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొన్నారు. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు స్థలాన్ని పరిశీలించి, పార్కులుగా గుర్తించిన ప్రాంతాలను ఫెన్సింగ్ చేసి రక్షించారు. అదనంగా, అవి పార్కు స్థలాలేనని తెలియజేస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
హైడ్రా కాపాడిన ఈ పార్కు భూముల విలువ సుమారు రూ.47 కోట్లుగా అంచనా వేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!