
గాసిప్స్

సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పోలీసుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తాలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అలాగే కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభించింది.
భోగి పండగ రోజునే ఈ మొత్తాలు ఖాతాల్లో జమ కావడంతో ఉద్యోగులు, పోలీసులు, కాంట్రాక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డీఏ, డీఆర్ ఎరియర్లుగా ఒక్కో ఉద్యోగి, పోలీసు ఖాతాలో సుమారు రూ.70 నుంచి 80 వేల వరకు జమ అవుతున్నాయి. పోలీసులకు అదనంగా సరెండర్ లీవులు, టీఏలు కూడా జమ అవుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకూ బకాయిలు అందుతున్నాయి. దాదాపు 5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులను ఆర్థిక శాఖ జమ చేస్తుండగా, ఉద్యోగ, పోలీసు సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!