
టెక్నాలజీ

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో నిరీక్షణ సమయం పెరిగింది. ప్రస్తుతం దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం, ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2 లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు వేచివుండగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు నిరీక్షిస్తున్నారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ దర్శనాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!