
జనరల్

తుంగభద్ర నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా సాధన కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం సాధించి జలాలను సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణకు 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 5–6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర జల వివాదాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్డీఎస్ ఆనకట్ట భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అలాగే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ కింద మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెంచి ప్రత్యామ్నాయంగా నీటి వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!