
న్యూస్

తిరుమల అలిపిరి మెట్లమార్గంలో నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో కీలక ఏర్పాటుకు టిటిడి శ్రీకారం చుట్టింది. అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ప్రారంభించినట్లు టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, నడక మార్గంలో భక్తులకు అకస్మాత్తుగా అనారోగ్యం తలెత్తినప్పుడు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఈ కేంద్రంలో 24 గంటల పాటు సేవలందిస్తారని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఈ సెంటర్ ప్రారంభం కావడం విశేషంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!