
గాసిప్స్

తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కృష్ణాపురం సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి తిరుపతికి వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్తున్న ఇద్దరు యువకులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాపురం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో అధిక వేగంతో వెళ్తున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కన ఉన్న చింత చెట్టును ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!