
టెక్నాలజీ

దిత్వా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంతంలోని పలు బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. వాతావరణ శాఖ జిల్లా వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించి, డిసెంబర్ 2 వరకు సముద్ర స్నానాలపై నిషేధం విధించింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద ప్రజల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేశారు.
బీచ్‌లకు పర్యాటకులు రావద్దని, స్థానికులు కూడా తీరప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో భద్రతా చర్యలు కఠినతరం చేశారు. వాతావరణ పరిస్థితులపై అధికారులు నిరంతరంగా నిఘా కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!