శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కలుషితమైన తాగునీరు కారణంగా డయేరియా వ్యాధి ప్రబలినట్లు సమాచారం. ప్రస్తుతం జీజీహెచ్‌లో బాధితులు చికిత్స పొందుతున్నారు. దాదాపు 30 మంది ఈ వ్యాధి బారిన పడ్డట్లు అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న పలువురు ఆసుపత్రిలో చేరగా, కొందరిని మొదట ప్రైవేట్ క్లినిక్‌లలో చికిత్స అందించి అనంతరం రిమ్స్‌కు తరలించారు. బాధితులు ప్రధానంగా దమ్మల వీధి, గోల్కొండ రేవు, మేదర వీధి టెంపుల్ పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
డయేరియా కేసులు పెరగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వైద్య అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించి అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, డయేరియాతో చికిత్స పొందుతూ మండల సురేష్ (42) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సురేష్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.





.jpeg&w=3840&q=75)














.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!