
సినిమాలు

హైదరాబాద్ జోనల్ యూనిట్ పరిధిలో DGGI అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరిగినట్లు అధికారులు గుర్తించారు. సోదాల అనంతరం ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్‌తో పాటు ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎండీ ఎన్. చేతన్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. వీరు రూ.50 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
అరెస్ట్ చేసిన ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు, అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరిస్తూ, ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!