

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో విడుదలైన ఈ డైరీ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యుల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు మరియు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న ‘మా’ కార్యవర్గాన్ని డిప్యూటీ సీఎం అభినందించారు.
ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జయవాణి, మలక్‌పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొంటూ మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులను భట్టి విక్రమార్క అభినందించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!