
గాసిప్స్

పద్మ అవార్డులు–2026కు ఎంపికైన వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, వివిధ రంగాల్లో అవార్డు గ్రహీతలు చూపిన అంకితభావం, ప్రతిభను ప్రశంసించారు.
తమ తమ రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ దేశ పురోగతికి అపూర్వమైన కృషి చేసినందుకే ఈ జాతీయ గౌరవాలు లభించాయని సీఎం పేర్కొన్నారు. వారి ప్రయాణాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని ట్వీట్ ద్వారా చంద్రబాబు నాయుడు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!