ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాసంలో ఈ రోజు ప్రత్యేకమైన సందడి నెలకొంది. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ – నయనికలను ఆశీర్వదించేందుకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి రాకతో అల్లు వారి ఇల్లు రాజకీయ, సినీ ప్రముఖులు చేరే వేదికగా మారింది. అల్లు అరవింద్ స్వయంగా ముఖ్యమంత్రిని సాదరంగా స్వాగతించి, శాలువాతో సత్కరించి గౌరవపూర్వక జ్ఞాపికను అందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ దంపతులు అల్లు శిరీష్, నయనికలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ నిండు నూరేళ్ల సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. సత్కార కార్యక్రమం అనంతరం, ముఖ్యమంత్రి అల్లు కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. భేటీలో కుటుంబ విషయాలపాటు పలు ఆసక్తికర అంశాలపై ముచ్చట జరిగింది.
ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత అనుబంధాన్ని ఈ సమావేశం మరొకసారి గుర్తు చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా ఇంటికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడం పట్ల మెగా అభిమానులు, అల్లు కుటుంబ అభిమానులు ప్రత్యేకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




-1773128308.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!