
క్రీడలు

పార్టీ మారుతున్నానన్న వార్తలను ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. కొందరు కావాలనే పిచ్చి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారడం అనేది బట్టలు మార్చుకోవడం లాంటి విషయం కాదని, తాను పదవుల కోసం తిరిగే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తాను మరియు బొడిగే శోభ పార్టీ మారుతున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్య పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికల అంశం పై రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!