
టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌కు కరూర్ తొక్కిసలాట కేసులో మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. మార్చి 10న విచారణకు హాజరుకావాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.
ఈ కేసు దర్యాప్తు భాగంగా విజయ్ ఇప్పటికే పలుమార్లు దిల్లీలోని సీబీఐ కార్యాలయానికి హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై ఆయన నుంచి మరింత స్పష్టత అవసరమని భావించి మళ్లీ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ర్యాలీ సమయంలో జనసమూహ నియంత్రణ ఏర్పాట్లు, ఈవెంట్ నిర్వహణకు మంజూరైన అనుమతులు, టీవీకే పార్టీ మరియు తమిళనాడు ప్రభుత్వ వాదనలు వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!