

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో సుధీర్ రెడ్డి సహా అతని స్నేహితులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో కేసులు నమోదు చేసి, వారిని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి వెంటనే హైదరాబాద్‌కు చేరుకుని, తన కుమారుడికి చెడు అలవాట్లు లేవని, అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కున్నాడని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం చట్టం అందరికీ సమానమేనని స్పష్టం చేస్తూ, ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ‘ఈగల్’ విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా తీవ్ర చర్చ సాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!