
సినిమాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. సోమవారం (మార్చి 16) పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఆయనకు నోటీసులు ఇచ్చి విడుదల చేసినట్లు సమాచారం. ఎంపీ మహేశ్ యాదవ్‌తో పాటు మరో నిందితురాలైన ప్రియాంక రెడ్డికూ స్టేషన్ బెయిల్ లభించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ కేసు దర్యాప్తును ఈగల్ టీమ్ వేగవంతం చేసింది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, దీని వెనుక ఎవరు ఉన్నారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు.

.jpeg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!