

సరస్వతీ అంత్య పుష్కరాలు వచ్చే నెల 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంత్రి డి శ్రీధర్ బాబు తో కలిసి అధికారిక పోస్టర్ మరియు టీజర్ విడుదల చేశారు. పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల కోసం 30.63 కోట్ల వ్యయంతో 162 అభివృద్ధి పనులు చేపట్టారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
భక్తులు ప్రశాంత వాతావరణంలో పుష్కర స్నానం చేసి స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 30 లక్షల మంది భక్తులు ఈ పుష్కరాలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. గతంలో జరిగిన మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం ఈ పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి రోజు ఉదయం5 గంటల 47 నిమిషాలకు ప్రారంభ పుష్కర స్నానం జరుగుతుంది. ప్రతి రోజు సాయంత్రం త్రివేణి సంగమం వద్ద ఘనంగా హారతి నిర్వహించనున్నారు. అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!