

ఓపెన్ ఏఐ సంస్థపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసుకు సంబంధించి అమెరికా కోర్టులో విచారణ ప్రారంభమైంది. మొదటి రోజు విచారణకు హాజరైన మస్క్ సంస్థపై పలు ఆరోపణలు చేస్తూ కృత్రిమ మేధతో మానవాళికి ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మస్క్ మాట్లాడుతూ, ఓపెన్ ఏఐ ప్రారంభ సమయంలో లాభాపేక్ష రహితంగా కొనసాగుతామని ఇచ్చిన హామీని ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రస్తుతం సంస్థ లాభాల లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతూ భవిష్యత్తులో మానవ మేధను అధిగమించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాను ఓపెన్ ఏఐ స్థాపనలో భాగమవడానికి కారణం లాభాపేక్ష రహిత కృత్రిమ మేధ సంస్థ అవసరం అనే భావనేనని మస్క్ తెలిపారు. అయితే సంస్థ నిర్మాణంలో మార్పులు తన పెట్టుబడులను తప్పుదారి పట్టించాయని ఆయన కోర్టులో వాదించారు. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!