
టెక్నాలజీ

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణుడిని దర్శించి, ఆలయ పండితుల చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గర్భగుడిలో నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ దైవ దర్శనం పొందిన ఆయనకు భక్తులు విశేష స్వాగతం పలికారు.
.png)
తరువాత ఆయన పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ను సందర్శించి, మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారి ఆశీర్వాదాలు పొందారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం స్వామీజీ ఆశీస్సులు అందించారు. పవన్ కళ్యాణ్ రాకతో ఉడుపి క్షేత్ర భక్తులు, స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.





.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!