

పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కలిగంజ్ ప్రాంతంలో ఓ హిందూ వితంతు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా, చెట్టుకు కట్టి జుట్టును కత్తిరించి అమానుషంగా ప్రవర్తించారు. తీవ్ర గాయాలపాలైన మహిళ స్పృహ కోల్పోయగా, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ప్రకారం, రెండున్నరేళ్ల క్రితం నిందితుల వద్ద బాధితురాలు భూమి, ఇల్లు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఒక నిందితుడు ఆమెను వేధిస్తూ వచ్చాడు. శనివారం సాయంత్రం బంధువులు ఇంటికి వచ్చిన సమయంలో ఇద్దరు నిందితులు ఇంట్లోకి చొరబడి బంధువులను తరిమికొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టినట్లు సమాచారం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్లో ఇటీవలి కాలంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!