

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లక్షలాది విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు రాష్ట్రంలో నమోదైన విద్యార్థులలో 67,01,653 మందికి మొత్తం రూ.8,454 కోట్ల సాయం అందించినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకం ప్రయోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నమోదైన విద్యార్థులలో అధిక శాతం మందికి తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించినట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వ కాలంలో తక్కువ శాతం విద్యార్థులకు మాత్రమే సాయం అందిందని విమర్శించారు. అర్హత ఉన్నప్పటికీ సాయం అందని వారి వివరాలు అందిస్తే పరిశీలించి సరిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!