

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృత్రిమ మేధ వల్ల రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ మార్పు నిజమైందని, చాలా సమీపంలోనే ఉందని తెలిపారు. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, సమాజం ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని పేర్కొన్నారు. ఇటీవల ఒరాకిల్ సంస్థలో జరిగిన ఉద్యోగాల కోతలను ఉదాహరణగా ప్రస్తావించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని కేటీఆర్ సూచించారు. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత దశాబ్దంలో భారత్ భౌతిక, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిలో ముందంజలో ఉందని తెలిపారు. అయితే ఇకపై ఇతర దేశాల నమూనాలను అనుసరించడం కాకుండా, సొంతంగా కొత్త ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!