

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కరాత్రిలోనే 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లలో కీలక మార్పులు చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేస్తూ కొత్త నియామకాలు చేపట్టింది. ఈ మార్పుల్లో భాగంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించగా, తరంజిత్ సింగ్ సంధును ఢిల్లీ ఎల్జీగా నియమించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్‌గా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు.
ఇక నాగాలాండ్ గవర్నర్‌గా నంద కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ నియమితులయ్యారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చేయగా, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు తమిళనాడు గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. అలాగే లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మార్పులు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!