

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయడంతో సుమారు 24,400 మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. వీరిలో సుమారు 2 వేల మంది హైదరాబాదీయులు ఉన్నట్లు సమాచారం. దీంతో స్వదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టు తిరిగి ప్రారంభమై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు విమానాలు టేకాఫ్ అయ్యాయి.
హైదరాబాద్‌కు రావాల్సిన ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా, అనంతరం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులను తిరిగి హోటళ్లకు తరలించారు. పర్యాటకం, వ్యాపారం, ఉన్నత విద్య, వైద్యం కోసం దుబాయ్‌కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. గత ఏడాది శంషాబాద్ విమానాశ్రయం నుంచి 5,23,107 మంది ప్రయాణించినట్లు సమాచారం. ఇందులో 50–60 శాతం మంది టూరిస్టులే కాగా, ప్రతిరోజూ 5–6 డైరెక్ట్ మరియు 15 వరకు కనెక్టింగ్ విమానాలు నడుస్తూ సగటున 1,400–1,500 మంది ప్రయాణిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!