
క్రీడలు
.webp&w=3840&q=75)
రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్రానికి సంబంధించిన కొత్త క్యారెక్టర్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నటుడు సుదేవ్ నాయర్ ‘కర్మడి’ పాత్రలో గన్ పట్టుకుని కనిపిస్తూ తీవ్రతతో నిండిన లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. పొగమంచు వాతావరణం, పాతకాలపు బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించిన ఈ పోస్టర్ సినిమా యాక్షన్, క్రైమ్ నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

గీతూ మోహనదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డార్క్ మరియు స్టైలిష్ కథాంశంతో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!