

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శార్వరి వాఘ్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రాబోతున్న మై వాపస్ ఆవుంగా అనే ఎమోషనల్ పీరియాడిక్ లవ్ స్టోరీలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. 1947 దేశ విభజన నేపథ్యంలో సాగే ఈ సినిమా, చిన్ననాటి ప్రేమను కోల్పోయిన ఓ వృద్ధుడి భావోద్వేగ ప్రయాణాన్ని చూపించనుంది. దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 12న విడుదల కానుంది.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శార్వరి వాఘ్ మాట్లాడుతూ ఇంతియాజ్ అలీతో పని చేయడం తన కెరీర్లో ఒక పెద్ద కల నెరవేరినట్లు అనిపిస్తోందని తెలిపింది. ఆయన సినిమాల్లోని మహిళా పాత్రలు ఎంతో ఎమోషనల్గా, లోతుగా ఉంటాయని చెప్పింది. ప్రేమ కథలను ఆయన చూపించే ప్రత్యేక శైలిని తాను ఎప్పటినుంచో ఇష్టపడేదానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!