

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” సినిమా కోసం చిత్రబృందం భారీ ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంతో ఇప్పుడు భోపాల్‌లో నిర్వహించనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌పై మేకర్స్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో సినిమా నుంచి ఓ ప్రత్యేక పాటను లక్ష మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో విడుదల చేయనున్నారని సమాచారం. ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
భోపాల్‌లో చిత్ర యూనిట్ కోసం దాదాపు 200 హోటల్ గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. భారీ ఎల్ఈడీ సెటప్‌లు ఇండోర్ నుంచి, లైటింగ్ సామగ్రి హైదరాబాద్ నుంచి, మ్యూజిక్ ఎక్విప్‌మెంట్ ముంబై నుంచి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఒక్క ఈవెంట్‌కే దాదాపు ₹4 కోట్ల వరకు ఖర్చవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “పెద్ది” సినిమాకు ఈ మెగా ఈవెంట్ భారీ హైప్ తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!