

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ‘గట్టి కుస్తీ 2’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గట్టి కుస్తీ’కి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు విశాల్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం త్రిష వద్ద ఉన్న పెంపుడు కుక్క, తన కుక్క ‘టెడ్డీ’ కూతురేనని ఆయన సరదాగా చెప్పారు. అది పూడిల్ జాతికి చెందిన ఖరీదైన, ఎంతో క్యూట్ కుక్క అని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, తన భార్య జ్వాలా గుత్తా మరియు త్రిష ఎంతో మంచి స్నేహితులని, కలిసినప్పుడు ఎక్కువగా పెంపుడు కుక్కల గురించే మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టినందుకు త్రిష ఎలాంటి అభ్యంతరం చెప్పరని ఆశిస్తున్నానని నవ్వుతూ వ్యాఖ్యానించారు. త్రిషకు కుక్కలంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఆమె తరచూ తన పెంపుడు కుక్కలతో ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల తన వ్యక్తిగత విషయాలపై వచ్చిన ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇస్తూ, తన జీవితంలో జోక్యం చేసుకునే హక్కు తన పెట్ డాగ్‌కే ఉందని చెప్పి స్పందించారు. ఇప్పుడు విష్ణు విశాల్ చెప్పిన ఈ సరికొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (1)
Interesting