

తెలుగు సినిమా రంగంలో అవకాశాలు పొందుతున్న యువ నటి భాగ్యశ్రీ బోర్స్ ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన చిత్రం కాంతాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రాణా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1960 ల నేపథ్యంతో "ఫిల్మ్ ఇన్ ఫిల్మ్" కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రతి సన్నివేశానికి తన శక్తిమేర ప్రయత్నించానని, దుల్కర్, రాణా చూపిన ప్యాషన్ తనను మరింత ప్రేరేపించిందని తెలిపింది.
భాగ్యశ్రీ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు నన్ను కమర్షియల్ పెర్ఫార్మర్గా పిలిచారు. కాంతా తర్వాత నన్ను నిజమైన నటిగా గుర్తిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పింది. ఈ చిత్రాన్ని ఎంతో శ్రద్ధతో, ఖచ్చితమైన ప్లానింగ్‌తో తెరకెక్కించిన టీమ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. నవంబర్ 14 న విడుదల కానున్న కాంతా చిత్రం ఆమె కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని భాగ్యశ్రీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ చిత్రంపై ఉన్న విశ్వాసం, ప్యాషన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!