

ఇటీవలి నెలలుగా, భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఏదంటే — సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా. ఇద్దరు లెజెండ్స్ ఒకే తెరపై కనిపించబోతున్నారన్న వార్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించబోయే వ్యక్తి ఎవరో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
మొదట్లో ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఆయన ఇప్పటికే కమల్ హాసన్‌తో విక్రమ్, రజనీకాంత్‌తో కూలీ సినిమాల్లో పనిచేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం, లోకేష్ కథపై పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో, తన యూనివర్స్‌లో భాగమైన ఖైతి 2పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఈ చిత్రం ఆర్కేఎఫ్ఐ మరియు రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరు ప్రొడక్షన్ హౌజ్‌లు పెద్ద స్థాయి సినిమాలకు అనుభవజ్ఞులైన యువ దర్శకుల్ని పరిశీలిస్తున్నాయి. పెట్టా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ పేర్లు చర్చలో ఉన్నాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం, జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాక్. రజనీతో ఇప్పటికే భారీ హిట్ ఇచ్చిన నెల్సన్, తన డార్క్ కామెడీ స్టైల్‌కి పేరుగాంచారు. కాబట్టి ఈ భారీ మల్టీస్టారర్‌కి ఆయనే సరైన ఎంపికగా భావిస్తున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్లో బిజీగా ఉండగా, కమల్ హాసన్ తన తదుపరి చిత్రం భారతీయుడు 3 విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులు ఈ ఇద్దరు మహానటులు ఒకే తెరపై కనిపించే రోజును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!