

నాని సినిమాలకు మంచి వసూళ్లు రావడం కొత్త విషయమేమీ కాదు. అయితే ప్రస్తుతం ఆయన అభిమానులు కోరుకుంటున్నది కేవలం భారీ కలెక్షన్లు మాత్రమే కాదు, థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు మెచ్చుకునే స్పష్టమైన విజయం. దసరా, హాయ్ నాన్న తర్వాత అలాంటి సంపూర్ణ విజయంపై అభిమానుల్లో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. సరిపోదా శనివారం, ది ప్యారడైజ్ చిత్రాలు వసూళ్ల పరంగా ఆకట్టుకున్నప్పటికీ, స్పందన మాత్రం పూర్తిగా ఏకపక్షంగా లేకపోవడం గమనార్హం.
ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న బ్లడీ రోమియోపై భారీ ఆసక్తి నెలకొంది. నాని ఇమేజ్‌కు భిన్నమైన నేపథ్యంతో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం తర్వాత వెంకీ అట్లూరి, శివ నిర్వాణతో చేయబోయే ప్రాజెక్టులు కూడా ఆయన లైనప్‌లో ఉన్నాయి. వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటున్న నాని, ఈసారి మాత్రం వసూళ్లతో పాటు బలమైన ప్రేక్షకాదరణను అందుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రాల్లో ఏది ఆయనకు కలెక్షన్లతో పాటు పూర్తి స్థాయి పాజిటివ్ టాక్‌ను అందించి, ప్రస్తుతం ఉన్న గ్యాప్‌ను భర్తీ చేస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!