
జనరల్

బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం త్వరలో జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆమె పెళ్లి నిశ్చయమైంది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం జరిగిన నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదెల, సుస్మిత కొణిదెల, దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, నటుడు బ్రహ్మానందం, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు శ్రీను వైట్ల తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొత్త జంట సంతోషంగా ఉండాలని అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!