

తమిళ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలి వారాంతంలోనే మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా మరో కీలక మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, నాజర్, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. తమిళ వెర్షన్‌తో పోలిస్తే తెలుగు డబ్బింగ్ వెర్షన్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు వెర్షన్ వసూళ్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే శుక్రవారం నుంచి ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలోకి రానుండటంతో కొత్త విడుదల ప్రభావం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కలెక్షన్లపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ సాధించడం చిత్రబృందానికి మంచి ఊపునిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!