

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, నయనతార కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. యష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏపీలో ఈ సినిమాకు టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించొచ్చనే ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు నేరుగా సంబంధం లేని సినిమా, పైగా ఏపీలో చిత్రీకరణ జరపని సినిమాకు టికెట్ ధరల పెంపు ఎందుకంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కన్నడనాట కూడా ధరల పెంపు లేకుండానే సినిమా విడుదలవుతున్నప్పుడు ఏపీలో ప్రత్యేక వెసులుబాటు ఎందుకనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. ప్రభుత్వం, చిత్రబృందం నుంచి వచ్చే ప్రకటనతోనే అసలు విషయం తేలనుంది. అప్పటివరకు ‘టాక్సిక్’ టికెట్ ధరల అంశంపై ఉత్కంఠ కొనసాగనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!