

ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్‌తో అన్ని వాణిజ్య, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇటీవల యూఏఈ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని అబుదాబి ఆరోపించగా, ఇరాన్ ఆ ఆరోపణలను ఖండించింది.
మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో హర్మూజ్ నిర్వహణకు సంబంధించి ఒమన్‌తో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఒమన్ చర్యలపై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. హర్మూజ్‌లో రాకపోకలు తగ్గిపోవడంతో చమురు సరఫరా, ప్రాంతీయ వాణిజ్యంపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!