

రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాప్‌ఓ 23’ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం తొలుత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఆయన డేట్లు కుదరకపోవడంతో తమిళ నటుడు ఎస్.జె. సూర్యను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం ఎస్.జె. సూర్య రూ.8 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ రెమ్యునరేషన్ కారణంగా మేకర్స్ వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో అదే పాత్రకు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామ్ పోతినేని, జెనీలియాకు ‘రెడీ’ సినిమా కాలం నుంచే మంచి స్నేహం ఉంది. ఈ పరిచయంతోనే జెనీలియా సూచన మేరకు రితేష్‌ను సినిమాలోకి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కీలక పాత్రలో రితేష్ ఎలా కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!