
జనరల్

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. రూ.152 కోట్ల విలువైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సత్యేంద్ర జైన్ పాత్రపై దర్యాప్తు చేసిన ఏసీబీ, భారీ మొత్తంలో లంచాల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు పేర్కొంది.
సత్యేంద్ర జైన్‌తో పాటు మరో ఐదుగురిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్టీపీ టెండర్ల ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడి ప్రభుత్వానికి నష్టం కలిగించారన్న ఆరోపణలపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టైన నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!