
సినిమాలు

సౌత్ కొరియన్ పాప్ స్టార్ సై రూపొందించిన ‘గంగ్నమ్ స్టైల్’ పాట యూట్యూబ్‌లో అరుదైన ఘనత సాధించింది. 2012లో విడుదలైన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, తక్కువ సమయంలోనే 1 బిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకుంది. తాజాగా 14 ఏళ్ల తర్వాత ఏకంగా 6 బిలియన్ వ్యూస్ మైలురాయిని చేరుకున్నట్లు సమాచారం. దీంతో ఈ పాట ద్వారా వచ్చిన ఆదాయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నెటిజన్లలో ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం, 6 బిలియన్ వ్యూస్ కారణంగా ‘గంగ్నమ్ స్టైల్’కు దాదాపు 50 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.470 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండొచ్చని అంచనా. అయితే ఇది అధికారికంగా ధృవీకరించిన మొత్తం కాదు. యూట్యూబ్ ఆదాయంలో ప్లాట్‌ఫామ్ వాటా, కాపీరైట్ హక్కుదారులు, గాయకుడు, ఇతర భాగస్వాములకు దక్కే వాటాలు వేర్వేరుగా ఉంటాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!